కీర్తనలు 107:1-9

కీర్తనలు 107:1-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మంచివారు; ఆయన మారని ప్రేమ నిత్యం ఉంటుంది. యెహోవాచేత విమోచింపబడినవారు, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించినవారు, వివిధ దేశాల నుండి, తూర్పు పడమర, ఉత్తర దక్షిణాల నుండి ఆయన సమకూర్చినవారు వారి కథను చెప్పుదురు గాక. కొందరు ఏకాంతంగా ఎడారిలో తిరిగారు; నివాసయోగ్యమైన పట్టణం ఒక్కటి వారికి కనిపించలేదు. వారు ఆకలి దప్పికతో ఉన్నారు, వారి ప్రాణాలు సొమ్మసిల్లాయి. అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారిని వారి బాధలనుండి విడిపించారు. ఆయన వారిని తిన్నని బాటలో నివాసయోగ్యమైన పట్టణానికి నడిపించారు. యెహోవా యొక్క మారని ప్రేమ కోసం నరులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం వారు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక, దాహంతో ఉన్న వారి దాహాన్ని ఆయన తీరుస్తారు, మేలైన వాటితో ఆయన ఆకలి తీర్చుతారు.

కీర్తనలు 107:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యం ఉంటుంది. యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుతారు గాక. విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించిన వారూ, తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి నానాదేశాల నుండి ఆయన పోగు చేసినవారూ ఆ మాట పలుకుతారు గాక. వారు అరణ్యమార్గాల్లో ఎడారి త్రోవల్లో తిరుగులాడుతూ ఉండే వారు. నివాస పురమేదీ వారికి దొరకలేదు. ఆకలి దప్పుల వల్ల వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లిపోయింది. వారు కష్టకాలంలో యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు. వారొక నివాస పురం చేరేలా చక్కని దారిలో ఆయన వారిని నడిపించాడు. ఆయన నిబంధన విశ్వసనీయతను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలనుబట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఎందుకంటే దాహం గొన్న వారిని ఆయన తృప్తిపరచాడు. ఆకలి గొన్నవారిని మేలుతో నింపాడు.

కీర్తనలు 107:1-9 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి. ఆయన ప్రేమ శాశ్వతం. యెహోవా రక్షించిన ప్రతి మనిషి ఆ మాటలు చెప్పాలి. వారి శత్రువుల నుండి యెహోవా రక్షించిన ప్రతి మనిషీ ఆయనను స్తుతించాలి. అనేక దేశాల నుండి యెహోవా తన ప్రజలను ఒక్కచోట సమావేశపర్చాడు. తూర్పు పడమరల నుండి, ఉత్తర దక్షిణాల నుండి ఆయన వారిని తీసుకొని వచ్చాడు. ప్రజల్లో కొందరు ఎండిన ఎడారిలో సంచరించారు. వారు నివసించుటకు ఒక పట్టణంకోసం ఆ ప్రజలు వెదకుచుండిరి. కాని వారికి ఒక్కపట్టణం కూడా దొరకలేదు. ఆ ప్రజలు ఆకలితో, దాహంతో ఉండి బలహీనం అయ్యారు. అప్పుడు వారు సహాయం కోసం ఏడ్చి, యెహోవాకు మొరపెట్టి వేడుకొన్నారు. యెహోవా ఆ ప్రజలను వారి కష్టాలన్నింటి నుండి రక్షించాడు. ఆ ప్రజలు ఏ పట్టణంలో నివసించాలో సరిగ్గా ఆ పట్టణానికే దేవుడు ఆ ప్రజలను నడిపించాడు. యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెప్పండి! ప్రజల కోసం, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి. దాహంతో ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆకలితో ఉన్న ప్రాణాన్ని మంచి పదార్థాలతో దేవుడు నింపుతాడు.

కీర్తనలు 107:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుదురు గాక విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించినవారును తూర్పునుండి పడమటినుండి ఉత్తరమునుండి దక్షిణము నుండియు నానాదేశములనుండియు ఆయన పోగుచేసినవారును ఆమాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి యెడారిత్రోవను తిరుగులాడుచుండిరి. నివాస పురమేదియు వారికి దొరుకకపోయెను. ఆకలి దప్పులచేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను వారొక నివాస పురము చేరునట్లు చక్కనిత్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్య కార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి యున్నాడు. ఆకలిగొనినవారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు.

కీర్తనలు 107:1-9

కీర్తనలు 107:1-9 TELUBSIకీర్తనలు 107:1-9 TELUBSIకీర్తనలు 107:1-9 TELUBSI