సంఖ్యాకాండము 4:1-3 - Compare All Versions

సంఖ్యాకాండము 4:1-3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను –నీవు లేవీయులలో కహాతీయులను వారివారి వంశములచొప్పునను వారివారి పితరుల కుటుంబముల చొప్పునను ముప్పది యేండ్లు మొదలుకొని, యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి, ప్రత్యక్షపుగుడారములో పనిచేయుటకు సేనగా చేరగలవారందరి సంఖ్యను వ్రాయించుము.

సంఖ్యాకాండము 4:1-3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యెహోవా మోషే అహరోనులతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు. “లేవీ గోత్రం ప్రజల్లోని కహాతు వంశస్తుల్లో పురుషులను వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్క పెట్టాలి. వారిలో ముప్ఫై ఏళ్ల వయస్సు నుండి యాభై ఏళ్ల వరకూ ఉన్న వారిని లెక్క పెట్టు. వీరు సన్నిధి గుడారంలో సేవలో చేరాలి.

సంఖ్యాకాండము 4:1-3 TERV (పవిత్ర బైబిల్)

మోషే అహరోనులతో యెహోవా ఇలా చెప్పాడు: “కహాతు వంశంలోని కుటుంబాలకు చెందిన పురుషులను లెక్కించండి. (కహాతు వంశం లేవీ వంశంలోని ఒక భాగం.) సైన్యంలో పని చేసిన వారిలో 30 నుండి 50 సంవత్సరాల వరకు వయసుగల పురుషులందరినీ లెక్కించండి. ఈ పురుషులు సన్నిధి గుడారంలో పని చేస్తారు.

సంఖ్యాకాండము 4:1-3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యెహోవా మోషే అహరోనులకు ఇలా చెప్పారు: “లేవీ గోత్రంలో కహాతు వంశాల, కుటుంబాల ప్రకారం జనాభా లెక్కలు తీసుకోండి. సమావేశ గుడారంలో సేవ చేయడానికి వచ్చే ముప్పై నుండి యాభై సంవత్సరాల లోపు వయస్సున్న పురుషులందరినీ లెక్కించు.