ఎఫెసీయులకు 6:23-24 - Compare All Versions

ఎఫెసీయులకు 6:23-24 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

సహోదరీ సహోదరులందరికి మన తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి సమాధానం, విశ్వాసంతో కూడిన ప్రేమ కలుగును గాక. మన ప్రభువైన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికందరికి కృప కలుగును గాక.

షేర్ చేయి
ఎఫెసీయులకు 6 TSA

ఎఫెసీయులకు 6:23-24 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

తండ్రియైన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు శాంతినీ విశ్వాసంతో కూడిన ప్రేమను సోదరులకు అనుగ్రహించు గాక మన ప్రభు యేసు క్రీస్తుపై నిత్య ప్రేమను కనపరిచే వారికందరికీ కృప తోడై ఉండుగాక.

షేర్ చేయి
ఎఫెసీయులకు 6 IRVTEL

ఎఫెసీయులకు 6:23-24 TERV (పవిత్ర బైబిల్)

సోదరులందరికీ తండ్రియైన దేవుని నుండి, యేసు క్రీస్తు ప్రభువు నుండి విశ్వాసంతో పాటు శాంతి, ప్రేమ లభించుగాక! మన యేసు క్రీస్తు ప్రభువును ప్రేమించేవాళ్ళకు ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ లభించుగాక!

షేర్ చేయి
ఎఫెసీయులకు 6 TERV

ఎఫెసీయులకు 6:23-24 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండియు సమాధానమును విశ్వాసముతోకూడిన ప్రేమయును సహోదరులకు కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికిని కృప కలుగును గాక.