పరమ గీతము 2:8-14

పరమ గీతము 2:8-14 TERV

నా ప్రియుని గొంతు వింటున్నాను. అదిగో అతడు వస్తున్నాడు. పర్వతాల మీది నుంచి దూకుతూ కొండల మీది నుంచి వస్తున్నాడు. నా ప్రియుడు దుప్పిలా ఉన్నాడు లేదా లేడి పిల్లలా ఉన్నాడు. మన గోడ వెనుక నిలబడివున్న అతన్ని చూడు, కిటికీలోనుంచి తేరి పార చూస్తూ, అల్లిక కిటికీలోనుంచి చూస్తూ నా ప్రియుడు నాతో అంటున్నాడు, “నా ప్రియురాలా, లెమ్ము, నా సుందరవతీ, రా, వెళ్లిపోదాం! చూడు, శీతాకాలం వెళ్లిపోయింది, వర్షాలు వచ్చి వెళ్లిపోయాయి. పొలాల్లో పూలు వికసిస్తున్నాయి ఇది పాడే సమయం! విను, పావురాలు తిరిగి వచ్చాయి. అంజూర చెట్లమీద చిన్న పండ్లు ఎదుగుతున్నాయి. పూస్తున్న ద్రాక్షా పూల సువాసన చూడు. నా ప్రియురాలా, సుందరవతీ, లేచిరా, మనం వెళ్లిపోదాం!” కనపడని ఎత్తైన శిఖరంమీద గుహల్లో దాక్కొన్న నా పావురమా! నిన్ను చూడనిమ్ము, నీ గొంతు విననిమ్ము, నీ గొంతు ఎంతో మధురం, నువ్వెంతో సుందరం!