రోమీయులకు వ్రాసిన లేఖ 9:24-26
రోమీయులకు వ్రాసిన లేఖ 9:24-26 TERV
యూదుల నుండే కాక, యూదులు కానివాళ్ళ నుండి కూడా దేవుడు ప్రజల్ని పిలిచాడు. ఆయన పిలిచింది మనల్నే. హోషేయ గ్రంథంలో దేవుడు ఈ విధంగా చెప్పాడు: “నా ప్రజలు కాని వాళ్ళను నా ప్రజలని పిలుస్తాను. నా ప్రియురాలు కాని జనాన్ని నా ప్రియురాలా అని పిలుస్తాను.” “మీరు నా ప్రజలు కారు అని అన్న చోటనే మీరు సజీవంగా ఉండే దేవుని పుత్రులు అని అనటం సంభవిస్తుంది.”

