కీర్తనల గ్రంథము 7

7
యెహోవాకు దావీదు పాడిన కీర్తన. బెన్యామీను వంశానికి చెందిన కీషు కుమారుడైన సౌలును గూర్చినది ఈ పాట.
1యెహోవా నా దేవా, నిన్ను నేను నమ్ముకొన్నాను.
నన్ను తరుముతున్న మనుష్యుల బారినుండి నన్ను రక్షించుము. నన్ను తప్పించుము.
2నాకు నీవు సహాయం చేయకపోతే అప్పుడు నేను సింహంచే పట్టబడి చీల్చబడిన జంతువులాగ ఉంటాను.
నేను ఈడ్చుకొని పోబడతాను. ఏ మనిషి నన్ను రక్షించజాలడు.
3యెహోవా నా దేవా, నేను తప్పు చేసిన దోషిని కాను. నేనేమీ తప్పు చేయలేదు.
4నా స్నేహితునికి నేనేమీ కీడు చేయలేదు.
నా స్నేహితుని శత్రువులకు నేను సహాయం చేయలేదు.
5కాని నేను అలా చేసియుండిన యెడల శత్రువు నన్ను తరుమనిమ్ము.
నన్ను పట్టుకొననిమ్ము, నా జీవితాన్ని నేలమీద త్రొక్కనిమ్ము.
మరియు నా ప్రాణాన్ని మట్టిలోనికి నెట్టివేయనిమ్ము.
6యెహోవా, లెమ్ము. నీ కోపాన్ని చూపెట్టుము.
నా శత్రువు కోపంగా ఉన్నాడు కనుక నిలిచివానికి విరోధంగా పోరాడుము.
లేచి న్యాయంకోసం వాదించుము.
7జనాలను నీ చుట్టూ ప్రోగుచేసి,
వారి మీద పైనుండి పరిపాలించుము.
8ప్రజలకు తీర్పు తీర్చుము. యెహోవా, నాకు తీర్పు తీర్చుము.
నేను సరిగ్గా ఉన్నట్టు రుజువు చేయుము.
నేను నిర్దోషిని అని రుజువు చేయుము.
9చెడ్డవాళ్లను శిక్షించి
మంచివాళ్లకు సహాయం చేయుము.
దేవా, నీవు మంచివాడవు,
మరియు ప్రజల హృదయపు లోతుల్లోనికి నీవు చూడగలవు.
10నిజాయితీ హృదయాలుగల వారికి దేవుడు సహాయం చేస్తాడు.
కనుక దేవుడు నన్ను కాపాడుతాడు.
11దేవుడు మంచి న్యాయమూర్తి,
మరియు ఏ సమయంలోనైనా దేవుడు తన కోపాన్ని చూపిస్తాడు.
12దేవుడు ఒక నిర్ణయం చేస్తే
ఆయన తన మనస్సు మార్చుకోడు.
13ప్రజలను శిక్షించే శక్తి దేవునికి ఉంది.
14కొంతమంది మనుష్యులు చెడ్డపనులు చేసేందుకే ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటారు.
అలాంటివారు రహస్య పథకాలు వేస్తూ, అబద్ధాలు చెబుతారు.
15వారు యితరులను ఉచ్చులో వేసి, హాని చేయాలని ప్రయత్నిస్తారు.
అయితే వారి స్వంత ఉచ్చుల్లో వారే చిక్కుబడతారు.
16వారు పొందాల్సిన శిక్ష వారు పొందుతారు.
ఇతరులయెడల వారు కృ-రంగా ప్రవర్తించారు.
అయితే వారు దేనికి పాత్రులో దానిని పొందుతారు.
17యెహోవా మంచివాడు గనుక నేను ఆయనను స్తుతిస్తాను.
మహోన్నతుడైన యెహోవా నామాన్ని నేను స్తుతిస్తాను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనల గ్రంథము 7: TERV

హైలైట్

షేర్ చేయి

సరిపోల్చండి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి