దానియేలు 9:18-19
దానియేలు 9:18-19 TERV
నా దేవా, నీ చెవి వంచి నా ప్రార్థన వినుము! నీ కన్నులు తెరిచి, పాడుబడిన, నీ పేరు పెట్టబడిన ఈ నగరముపైన నీ దృష్టినుంచుము. మేము నీతిమంతులమని కాదుగాని, నీవు కృపామయుడవని నీకు మొర పెట్టుచున్నాము. ప్రభువా! నా మొర ఆలకించు. ప్రభువా! మమ్ము మన్నించుము. ప్రభువా, మా ప్రార్థన విని, సహాయం చేయి. నా దేవా! ఆలస్యం చేయవద్దు. నా దేవా, నీ నామ మహిమ కొరకు నీ పట్టణం, నీ ప్రజలు నీ పేరును ధరించియున్నారు.”

