దానియేలు 5:25-28

దానియేలు 5:25-28 TERV

ఈ క్రింది మాటలే గోడమీద వ్రాయబడినవి: మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్. “ఈ మాటలకు అర్థం ఇది: మెనే: అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్కచూసి దాన్ని ముగించాడు. టెకేల్: అనగా దేవుడు నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడ్డావు. ఉఫార్సీన్: అనగా నీ రాజ్యం నీ వద్దనుండి తీసివేయబడి మాదీయులకూ పారసీకులకూ విభజింపబడింది.”