ఆమోసు 1:1-2

ఆమోసు 1:1-2 TERV

ఇది ఆమోసు వర్తమానం. ఆమోసు తెకోవ నగరానికి చెందిన ఒక పశువుల కాపరి. ఉజ్జియా యూదాకు రాజుగాను, యెహోయాషు కుమారుడు యరొబాము ఇశ్రాయేలుకు రాజుగాను ఉన్న కాలంలో ఆమోసు ఇశ్రాయేలునుగూర్చి దర్శనాలు చూశాడు. ఇది భూకంపం రావటానికి రెండు సంవత్సరాల ముందటి విషయం. ఆమోసు ఇలా అన్నాడు: “యెహోవా సీయోనులో సింహంలా గర్జిస్తాడు. ఆయన గంభీర స్వరం యెరూషలేమునుండి గర్జిస్తుంది. గొర్రెల కాపరుల పచ్చిక బయళ్లు ఎండిపోతాయి. కర్మెలు పర్వతం సహితం ఎండిపోతుంది.”

చదువండి ఆమోసు 1