రోమా 12:13-18

రోమా 12:13-18 TELUBSI

పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి; ఏడ్చువారితో ఏడువుడి; ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి. హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొన వద్దు. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.

రోమా 12:13-18 కోసం వీడియో

ఉచిత పఠన ప్రణాళికలు మరియు రోమా 12:13-18 కు సంబంధించిన వాక్య ధ్యానములు