కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి. తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవా డగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అను గ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను, ఈ అవయవములన్నిటికిని ఒక్కటే పని యేలాగు ఉండదో, ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము. మన కనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక, ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణముచొప్పున ప్రవచింతము; పరిచర్యయైతే పరిచర్యలోను
చదువండి రోమా 12
వినండి రోమా 12
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: రోమా 12:1-7
7 రోజులు
యదార్ధమైన క్రైస్తవ జీవితం ఏ విధంగా కనిపిస్తుంది? లేఖనాలలోని అత్యంత శక్తివంతమైన భాగాలలో ఒక భాగమైన రోమా 12 అధ్యాయం మనకు ఒక చిత్రపటాన్ని ఇస్తుంది. ఈ పఠన ప్రణాళికలో, దేవుడు మన జీవితంలోని ప్రతి భాగాన్ని - మన ఆలోచనలు, స్వీయ-దృక్ఫథం, ఇతరులతో సంబంధాలు, దుష్టత్వంతో పోరాటాలలో దేవుడు మనలో పరివర్తన తీసుకొని వస్తుండగా నిజమైన ఆధ్యాత్మికత గురించి మీరు నేర్చుకుంటారు. దేవుని నుండి శ్రేష్ఠమైన దానిని పొందడం ఆరంభించండి, ఈ రోజున లోకాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడం ప్రారంభించండి.
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు