ప్రకటన 6:9-11

ప్రకటన 6:9-11 TELUBSI

ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు–నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూని వాసులకు ప్రతి దండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్య బడెను; మరియు–వారివలెనే చంపబడబోవువారి సహ దాసులయొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.

ప్రకటన 6:9-11 కోసం వీడియో