ప్రకటన 2:8-11

ప్రకటన 2:8-11 TELUBSI

స్ముర్నలో ఉన్న సంఘపుదూతకు ఈలాగు వ్రాయుము– మొదటివాడును కడపటివాడునైయుండి, మృతుడై మరల బ్రదికినవాడు చెప్పు సంగతులేవనగా –నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే; తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపు వారివలన నీకు కలుగు దూషణ నే నెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడ కుము. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువాడు రెండవ మరణమువలన ఏ హానియుచెందడు.

ప్రకటన 2:8-11 కోసం వీడియో