కీర్తనలు 7:1-5

కీర్తనలు 7:1-5 TELUBSI

యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి యున్నాను నన్ను తరుమువారిచేతిలోనుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడును లేకపోగా వారు సింహమువలె ముక్కలుగా చీల్చివేయకుండ నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యముచేసిన యెడల నాచేత పాపము జరిగినయెడల నాతో సమాధానముగా నుండినవానికి నేను కీడు చేసినయెడల శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము నా ప్రాణమును నేలకు అణగద్రొక్క నిమ్ము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించినవారిని నేను సంరక్షించితిని గదా. (సెలా.)