కీర్తనలు 109:21-27

కీర్తనలు 109:21-27 TELUBSI

యెహోవా ప్రభువా, నీ నామమునుబట్టి నాకు సహాయము చేయుము నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. నేను దీనదరిద్రుడను నా హృదయము నాలో గుచ్చ బడియున్నది. సాగిపోయిన నీడవలె నేను క్షీణించియున్నాను మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు ఉపవాసముచేత నా మోకాళ్లు బలహీనమాయెను నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. వారి నిందలకు నేను ఆస్పదుడనైతినివారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు యెహోవా నాదేవా, యిది నీచేత జరిగినదనియు యెహోవావైన నీవే దీని చేసితివనియు వారికి తెలియు నట్లు నాకు సహాయము చేయుము నీ కృపనుబట్టి నన్ను రక్షింపుము.