ఎవడును తరుమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు. దేశస్థుల దోషమువలన దాని అధికారులు అనేకులగుదురు బుద్ధిజ్ఞానములుగలవారిచేత దాని అధికారము స్థిర పరచబడును. బీదలను బాధించు దరిద్రుడు ఆహారవస్తువులను ఉండనియ్యక కొట్టుకొనిపోవు వానతో సమానుడు. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడు చుందురు ధర్మశాస్త్రము ననుసరించువారు వారితో పోరాడుదురు. దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. వంచకుడై ధనము సంపాదించినవానికంటె యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఉపదేశము నంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. వడ్డిచేతను దుర్లాభముచేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కరుణించువానికొరకు దాని కూడబెట్టును. ధర్మశాస్త్రము వినబడకుండ చెవిని తొలగించుకొనువాని ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును యథార్థవంతులు మేలైనదానిని స్వతంత్రించుకొందురు. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకముగల దరిద్రుడు వానిని పరిశోధించును. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయముగలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరచుకొనువాడు కీడులో పడును. బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు. వివేకములేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారీ, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. ప్రాణము తీసి దోషము కట్టుకొనినవాడు గోతికి పరుగెత్తుచున్నాడు ఎవరును అట్టివానిని ఆపకూడదు. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. తన పొలము సేద్యము చేసికొనువానికి కడుపునిండ అన్నము దొరకును వ్యర్థమైనవాటిని అనుసరించువారికి కలుగు పేదరికము ఇంతంతకాదు. నమ్మకమైనవానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందకపోడు. పక్షపాతము చూపుట మంచిది కాదు రొట్టెముక్కకొరకు ఒకడు దోషముచేయును. చెడు దృష్టిగలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. నాలుకతో ఇచ్చకములాడు వానికంటె నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయపొందును. తన తలిదండ్రుల సొమ్ము దోచుకొని–అది ద్రోహము కాదనుకొనువాడు నశింపజేయువానికి జతకాడు. పేరాసగలవాడు కలహమును రేపును యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. బీదలకిచ్చువానికి లేమి కలుగదు కన్నులు మూసికొనువానికి బహు శాపములు కలుగును. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురువారు నశించునప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు.
చదువండి సామెతలు 28
వినండి సామెతలు 28
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: సామెతలు 28:1-28
1 Week
Learn what the Bible says about boldness and confidence. The "Courage" Reading Plan encourages believers with reminders of who they are in Christ and in God's kingdom. When we belong to God, we're free to approach Him directly. Read again – or maybe for the first time – assurances that your place in God's family is secure.
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు