కాదేషులోనుండి బయలుదేరి ఎదోము దేశముకడనున్న హోరుకొండ దగ్గర దిగిరి. యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి, ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరి వచ్చిన నలువదియవ సంవత్సరమున అయిదవ నెల మొదటి దినమున అక్కడ మృతినొందెను. అహరోను నూటఇరువదిమూడేండ్ల యీడుగలవాడై హోరు కొండమీద మృతినొందెను. అప్పుడు దక్షిణదిక్కున కనానుదేశమందు నివసించిన అరాదురాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను. వారు హోరు కొండనుండి బయలుదేరి సల్మానాలో దిగిరి. సల్మానాలోనుండి బయలుదేరి పూనొనులో దిగిరి.
చదువండి సంఖ్యాకాండము 33
వినండి సంఖ్యాకాండము 33
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: సంఖ్యాకాండము 33:37-42
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు