సంఖ్యాకాండము 33:18-36

సంఖ్యాకాండము 33:18-36 TELUBSI

హజే రోతులోనుండి బయలుదేరి రిత్మాలో దిగిరి. రిత్మాలోనుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి. రిమ్మోను పారె సులోనుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి. లిబ్నాలోనుండి బయలుదేరి రీసాలో దిగిరి. రీసాలోనుండి బయలుదేరి కెహేలాతాలో దిగిరి. కెహేలాతాలోనుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి. షాపెరు కొండ నొద్దనుండి బయలుదేరి హరాదాలో దిగిరి. హరాదాలోనుండి బయలుదేరి మకెలోతులో దిగిరి. మకెలోతులోనుండి బయలుదేరి తాహతులో దిగిరి. తాహతులోనుండి బయలుదేరి తారహులో దిగిరి. తారహులోనుండి బయలుదేరి మిత్కాలో దిగిరి. మిత్కాలోనుండి బయలుదేరి హష్మోనాలో దిగిరి. హష్మోనాలోనుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి. మొసేరోతులోనుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి. బెనేయాకానులోనుండి బయలుదేరి హోర్‌హగ్గిద్గాదులో దిగిరి. హోర్‌హగ్గిద్గా దులోనుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి. యొత్బా తాలోనుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి. ఎబ్రో నాలోనుండి బయలుదేరి ఎసోన్గెబెరులో దిగిరి. ఎసోన్గె బెరులోనుండి బయలుదేరి కాదేషు అనబడిన సీను అరణ్యములో దిగిరి.