సంఖ్యాకాండము 26:52-56

సంఖ్యాకాండము 26:52-56 TELUBSI

యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–వీరి పేళ్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను. ఎక్కువమందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను; తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. దాని దాని జనసంఖ్యనుబట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యము ఇయ్యవలెను. చీట్లువేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమతమపితరుల గోత్రముల జనసంఖ్యచొప్పున స్వాస్థ్యమును పొందవలెను. ఎక్కువ మందికేమి తక్కువమందికేమి చీట్లు వేసి యెవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలెను.