సంఖ్యాకాండము 22:22-27
సంఖ్యాకాండము 22:22-27 TELUBSI
అతడు వెళ్లుచుండగా దేవుని కోపము రగులుకొనెను; యెహోవాదూత అతనికి విరోధియై త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితోకూడ నుండిరి. యెహోవాదూత ఖడ్గము దూసి చేతపట్టుకొని త్రోవలో నిలిచి యుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాని కొట్టగా యెహోవాదూత యిరుప్రక్కలను గోడలుగల ద్రాక్షతోటల సందులో నిలిచెను. గాడిద యెహోవాదూతను చూచి గోడమీదపడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాని మరల కొట్టెను. యెహోవాదూత ముందు వెళ్లుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని యిరుకు చోటను నిలువగా గాడిద యెహోవాదూతను చూచి బిలాముతోకూడ క్రింద కూలబడెను గనుక బిలాము కోపముమండి తన చేతి కఱ్ఱతో గాడిదను కొట్టెను.

