వారు ఐగుప్తుదేశమునుండి బయలువెళ్లిన రెండవ సంవత్సరము రెండవనెల మొదటి తేదిని, సీనాయి అరణ్య మందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను –ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములనుబట్టి వారి వారి పెద్దలచొప్పున మగవారినందరిని లెక్కించి సర్వసమాజసంఖ్యను వ్రాయించుము. ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్లువారిని, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయముగల వారిని, తమతమ సేనలనుబట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. మరియు ప్రతి గోత్రములో ఒకడు, అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు, మీతోకూడ ఉండవలెను. మీతోకూడ ఉండవలసినవారి పేళ్లు ఏవేవనగా–రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు; షిమ్యోను గోత్రములో సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు యూదా గోత్రములో అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఇశ్శాఖారు గోత్రములో సూయారు కుమారుడైన నెతనేలు జెబూలూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలీయాబు యోసేపు సంతానమందు, అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామా; మనష్షే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలీయేలు బెన్యామీను గోత్రములో గిద్యోనీ కుమారుడైన అబీదాను దాను గోత్రములో అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగీయేలు గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీర అనునవి. వీరు సమాజములో పేరు పొందినవారు. వీరు తమతమపితరుల గోత్రములలో ప్రధానులు ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలును. పేళ్ల చేత వివరింపబడిన ఆ మనుష్యులను మోషే అహరోనులు పిలుచుకొని రెండవనెల మొదటి తేదిని సర్వసమాజమును కూర్చెను. ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయముగలవారు తమతమ వంశావళులనుబట్టి తమతమ వంశములను తమతమపితరుల కుటుంబములను తమతమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను. ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియ చెప్పగా రూబేను గోత్రములో లెక్కింపబడినవారు నలుబది యారువేల ఐదువందలమంది యైరి. షిమ్యోను పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా షిమ్యోను గోత్రములో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిదివేల మూడు వందలమంది యైరి. గాదు పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా గాదు గోత్రములో లెక్కింప బడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది యైరి. యూదా పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా యూదా గోత్రములో లెక్కింపబడినవారు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది యైరి. ఇశ్శాఖారు పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా ఇశ్శాఖారు గోత్రములో లెక్కింపబడినవారు ఏబది నాలుగువేల నాలుగువందలమంది యైరి. జెబూలూను పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా జెబూలూను గోత్రములో లెక్కింపబడినవారు ఏబదియేడువేల నాలుగువందలమంది యైరి. యోసేపు పుత్రుల వంశావళి, అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా యోసేపు గోత్రములో లెక్కింపబడినవారు నలుబదివేల ఐదువందలమంది యైరి.
చదువండి సంఖ్యాకాండము 1
వినండి సంఖ్యాకాండము 1
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: సంఖ్యాకాండము 1:1-33
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు