నెహెమ్యా 12:1-11

నెహెమ్యా 12:1-11 TELUBSI

షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోకూడ వచ్చిన యాజకులును లేవీయులును వీరే. యేషూవ శెరాయా యిర్మీయా ఎజ్రా అమర్యా మళ్లూకు హట్టూషు షెకన్యా రెహూము మెరేమోతు ఇద్దో గిన్నెతోను అబీయా. మీయామిను మయద్యా బిల్గా షెమయా యోయారీబు యెదాయా సల్లూ ఆమోకు హిల్కీయా యెదాయా అనువారు. వారందరును యేషూవ దినములలో యాజకులలోను వారి బంధువులలోను ప్రధానులుగా ఉండిరి. మరియు లేవీయులలో యేషూవ బిన్నూయి కద్మీయేలు షేరేబ్యా యూదా స్తోత్రాది సేవవిషయములో ప్రధానియైన మత్తన్యాయు అతని బంధువులును. మరియు బక్బుక్యాయు ఉన్నీయును వారి బంధువులును వారికి ఎదురు వరుసలోనుండి పాడువారు. యేషూవ యోయాకీమును కనెను, యోయాకీము ఎల్యాషీబును కనెను, ఎల్యాషీబు యోయా దాను కనెను. యోయాదా యోనాతానును కనెను. యోనాతాను యద్దూవను కనెను.