విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి, ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములుకొనిరి. వారు ఆదివారమున పెందలకడ (లేచి, బయలుదేరి) సూర్యోదయమైనప్పుడు సమాధియొద్దకు వచ్చుచుండగా, –సమాధి ద్వారమునుండి మనకొరకు ఆ రాయి యెవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తిచూడగా, రాయి పొర్లింపబడి యుండుట చూచిరి. ఆ రాయి యెంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి, తెల్లని నిలువుటంగీ ధరించుకొనియున్న యొక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందు కతడు కలవర పడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు; వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్లి ఆయన మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతురుతోను చెప్పుడనెను. వారు బయటకు వచ్చి, విస్మయము నొంది వణకుచు సమాధియొద్దనుండి పారిపోయిరి; వారు భయపడినందున ఎవనితో ఏమియు చెప్పలేదు.
చదువండి మార్కు 16
వినండి మార్కు 16
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మార్కు 16:1-8
8 రోజులు
మా "ఈస్టర్ ఈజ్ క్రాస్" డిజిటల్ ప్రచారంతో ఈస్టర్ యొక్క నిజమైన స్ఫూర్తిని అనుభవించండి! ఈ ప్రత్యేక కార్యక్రమం లూమో ఈస్టర్ చిత్రాల నుండి ఉత్తేజకరమైన క్లిప్‌ల ద్వారా యేసు కథను అన్వేషించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది, వ్యక్తిగత ప్రతిబింబం, అర్ధవంతమైన సంభాషణలు మరియు సమాజ నిశ్చితార్థాన్ని ప్రోత్సహిస్తుంది. యేసు జీవితం, పరిచర్య మరియు అభిరుచిని హైలైట్ చేసే కంటెంట్‌ను కలిగి ఉన్న ఈ కార్యక్రమం బహుళ భాషలలో అందించబడుతుంది, ఈస్టర్ సీజన్ అంతా ఆశ మరియు విముక్తి సందేశంలో పంచుకునేందుకు అన్ని నేపథ్యాల ప్రజలను కలిసి తీసుకువస్తుంది.
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు