మార్కు 15:27-47

మార్కు 15:27-47 TELUBSI

మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతోకూడ సిలువవేసిరి. అప్పుడు ఆ మార్గమున వెళ్లుచున్నవారు తమ తలలూచుచు –ఆహా దేవాలయమును పడగొట్టి మూడుదినములలో కట్టువాడా, సిలువమీదనుండి దిగి, నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రు లును ప్రధానయాజకులును అపహాస్యము చేయుచు–వీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువమీదనుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతోకూడ సిలువ వేయబడినవారును ఆయనను నిందించిరి. మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము. దగ్గర నిలిచినవారిలో కొందరు ఆ మాటలు విని–అదిగో ఏలీయాను పిలుచుచున్నాడనిరి. ఒకడు పరుగెత్తిపోయి యొక స్పంజీ చిరకాలోముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి; ఏలీయా వీని దింపవచ్చునేమో చూతమనెను. అంతట యేసు గొప్ప కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను. ఆయన కెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి–నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరమునుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, చిన్నయాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు, సలోమేయు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసినవారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్ర్తీలనేకులును వారిలో ఉండిరి. ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతిదినమునకు పూర్వదినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయియ యోసేపు తెగించి, పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము (తనకిమ్మని) యడిగెను. అతడు ఘనత వహించిన యొక సభ్యుడై, దేవుని రాజ్యముకొరకు ఎదురు చూచువాడు. పిలాతు – ఆయన ఇంతలోనే చని పోయెనా అని ఆశ్చర్యపడి యొక శతాధిపతిని తనయొద్దకు పిలిపించి–ఆయన ఇంతలోనే చనిపోయెనా అని అతని నడిగెను. శతాధిపతివలన సంగతి తెలిసికొని, యోసేపునకు ఆ శవము నప్పగించెను. అతడు నారబట్టకొని, ఆయనను దింపి, ఆ బట్టతో చుట్టి, బండలో తొలిపించిన సమాధియందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్దలేనే మరియయు యోసే తల్లియైన మరియయు ఆయన యుంచబడిన చోటు చూచిరి.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు మార్కు 15:27-47 కు సంబంధించిన వాక్య ధ్యానములు

ఈస్టర్ అనేది క్రాస్ - 4 రోజుల వీడియో ప్రణాళిక మార్కు 15:27-47 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

ఈస్టర్ అనేది క్రాస్ - 4 రోజుల వీడియో ప్రణాళిక

4 రోజులు

మా "ఈస్టర్ ఈజ్ క్రాస్" డిజిటల్ ప్రచారంతో ఈస్టర్ యొక్క నిజమైన స్ఫూర్తిని అనుభవించండి! ఈ ప్రత్యేక కార్యక్రమం లూమో ఈస్టర్ చిత్రాల నుండి ఉత్తేజకరమైన క్లిప్‌ల ద్వారా యేసు కథను అన్వేషించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది, వ్యక్తిగత ప్రతిబింబం, అర్ధవంతమైన సంభాషణలు మరియు సమాజ నిశ్చితార్థాన్ని ప్రోత్సహిస్తుంది. యేసు జీవితం, పరిచర్య మరియు అభిరుచిని హైలైట్ చేసే కంటెంట్‌ను కలిగి ఉన్న ఈ కార్యక్రమం బహుళ భాషలలో అందించబడుతుంది, ఈస్టర్ సీజన్ అంతా ఆశ మరియు విముక్తి సందేశంలో పంచుకునేందుకు అన్ని నేపథ్యాల ప్రజలను కలిసి తీసుకువస్తుంది.

ఈస్టర్ అనేది క్రాస్ - 8 రోజుల వీడియో ప్రణాళిక మార్కు 15:27-47 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

ఈస్టర్ అనేది క్రాస్ - 8 రోజుల వీడియో ప్రణాళిక

8 రోజులు

మా "ఈస్టర్ ఈజ్ క్రాస్" డిజిటల్ ప్రచారంతో ఈస్టర్ యొక్క నిజమైన స్ఫూర్తిని అనుభవించండి! ఈ ప్రత్యేక కార్యక్రమం లూమో ఈస్టర్ చిత్రాల నుండి ఉత్తేజకరమైన క్లిప్‌ల ద్వారా యేసు కథను అన్వేషించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది, వ్యక్తిగత ప్రతిబింబం, అర్ధవంతమైన సంభాషణలు మరియు సమాజ నిశ్చితార్థాన్ని ప్రోత్సహిస్తుంది. యేసు జీవితం, పరిచర్య మరియు అభిరుచిని హైలైట్ చేసే కంటెంట్‌ను కలిగి ఉన్న ఈ కార్యక్రమం బహుళ భాషలలో అందించబడుతుంది, ఈస్టర్ సీజన్ అంతా ఆశ మరియు విముక్తి సందేశంలో పంచుకునేందుకు అన్ని నేపథ్యాల ప్రజలను కలిసి తీసుకువస్తుంది.