మార్కు 14:17-26

మార్కు 14:17-26 TELUBSI

సాయంకాలమైనప్పుడు ఆయన తన పండ్రెండుమంది శిష్యులతోకూడ వచ్చెను. వారు కూర్చుండి భోజనముచేయుచుండగా యేసు–మీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి–నేనా అని యొకని తరువాత ఒకడు ఆయన నడుగసాగిరి. అందుకాయన – పండ్రెండు మందిలో ఒకడే, అనగా నాతోకూడ పాత్రలో (చెయ్యి) ముంచు వాడే. నిజముగా మనుష్యకుమారుడు ఆయననుగూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు; అయితే ఎవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో, ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలనెను. వారు భోజనముచేయుచుండగా, ఆయన యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, వారికిచ్చి–మీరు తీసికొనుడి; ఇది నా శరీరమనెను. పిమ్మట ఆయన గిన్నెపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారి కిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి. అప్పుడాయన –ఇది నిబంధనవిషయమై అనేకులకొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగుదినమువరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. అంతట వారు కీర్తన పాడి ఒలీవలకొండకు వెళ్లిరి.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు మార్కు 14:17-26 కు సంబంధించిన వాక్య ధ్యానములు

ఈస్టర్ అనేది క్రాస్ - 4 రోజుల వీడియో ప్రణాళిక మార్కు 14:17-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

ఈస్టర్ అనేది క్రాస్ - 4 రోజుల వీడియో ప్రణాళిక

4 రోజులు

మా "ఈస్టర్ ఈజ్ క్రాస్" డిజిటల్ ప్రచారంతో ఈస్టర్ యొక్క నిజమైన స్ఫూర్తిని అనుభవించండి! ఈ ప్రత్యేక కార్యక్రమం లూమో ఈస్టర్ చిత్రాల నుండి ఉత్తేజకరమైన క్లిప్‌ల ద్వారా యేసు కథను అన్వేషించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది, వ్యక్తిగత ప్రతిబింబం, అర్ధవంతమైన సంభాషణలు మరియు సమాజ నిశ్చితార్థాన్ని ప్రోత్సహిస్తుంది. యేసు జీవితం, పరిచర్య మరియు అభిరుచిని హైలైట్ చేసే కంటెంట్‌ను కలిగి ఉన్న ఈ కార్యక్రమం బహుళ భాషలలో అందించబడుతుంది, ఈస్టర్ సీజన్ అంతా ఆశ మరియు విముక్తి సందేశంలో పంచుకునేందుకు అన్ని నేపథ్యాల ప్రజలను కలిసి తీసుకువస్తుంది.

ఈస్టర్ అనేది క్రాస్ - 8 రోజుల వీడియో ప్రణాళిక మార్కు 14:17-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

ఈస్టర్ అనేది క్రాస్ - 8 రోజుల వీడియో ప్రణాళిక

8 రోజులు