అందుకు యేసు వారితో ఇట్లనెను–మీరు దేవునియందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి–నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి, తన మనస్సులో సందే హింపక తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకనిమీద విరోధ మేమైనను కలిగియున్నయెడల, మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును.
చదువండి మార్కు 11
వినండి మార్కు 11
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మార్కు 11:22-26
5 రోజులు
మన క్రైస్తవ జీవితంలో ప్రార్థన తరచుగా నిర్లక్ష్యం చెయ్యబడుతుంది. ఎందుకంటే దేవునికి ప్రతిదీ తెలుసు కాబట్టి, మనం ఆయనతో మాట్లాడవలసిన అవసరం లేదు అని మనం భావిస్తాము. అయితే ఈ ప్రణాళిక మీ జీవితాన్ని తిరిగి క్రమపరచడానికి మీకు సహాయపడుతుంది, తద్వారా మీ జీవితం కోసం దేవుని చిత్తాన్ని ఉద్దేశపూర్వకంగా వెదకడానికి మీరు సమయం కేటాయిస్తారు. మీరు ప్రార్థించేవన్నీ జరగడం చూసే వరకూ ప్రార్థన చేస్తారు. ఇకమీదట ప్రార్థన మనకు ఒక ప్రత్యామ్నాయ ఎంపిక కాదు అయితే ప్రతిదాని విషయంలో ప్రార్థన మొదటి ప్రతిస్పందనగా ఉండాలి.
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు