మత్తయి 4:23-25

మత్తయి 4:23-25 TELUBSI

యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమునుగూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను. ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగములచేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, దయ్యముపెట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయయను ప్రదేశములనుండియు యొర్దానునకు అవతలనుండియు బహుజనసమూహములు ఆయనను వెంబడించెను.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు మత్తయి 4:23-25 కు సంబంధించిన వాక్య ధ్యానములు

ఈస్టర్ అనేది క్రాస్ - 8 రోజుల వీడియో ప్రణాళిక మత్తయి 4:23-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

ఈస్టర్ అనేది క్రాస్ - 8 రోజుల వీడియో ప్రణాళిక

8 రోజులు

మా "ఈస్టర్ ఈజ్ క్రాస్" డిజిటల్ ప్రచారంతో ఈస్టర్ యొక్క నిజమైన స్ఫూర్తిని అనుభవించండి! ఈ ప్రత్యేక కార్యక్రమం లూమో ఈస్టర్ చిత్రాల నుండి ఉత్తేజకరమైన క్లిప్‌ల ద్వారా యేసు కథను అన్వేషించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది, వ్యక్తిగత ప్రతిబింబం, అర్ధవంతమైన సంభాషణలు మరియు సమాజ నిశ్చితార్థాన్ని ప్రోత్సహిస్తుంది. యేసు జీవితం, పరిచర్య మరియు అభిరుచిని హైలైట్ చేసే కంటెంట్‌ను కలిగి ఉన్న ఈ కార్యక్రమం బహుళ భాషలలో అందించబడుతుంది, ఈస్టర్ సీజన్ అంతా ఆశ మరియు విముక్తి సందేశంలో పంచుకునేందుకు అన్ని నేపథ్యాల ప్రజలను కలిసి తీసుకువస్తుంది.