ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తువలన ఆజ్ఞ ఆయెను. ఇది కురేనియు సిరియదేశమునకు అధిపతియై యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమతమ పట్టణములకు వెళ్లిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతియైయుండిన మరియతోకూడ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతునుండి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్లెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత–భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకానవాలు; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్ట బడి యొకతొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెద రని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతోకూడనుండి –సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమయొద్దనుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొఱ్ఱెల కాపరులు–జరిగిన యీ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించియున్నాడు; మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి. వారు చూచి, యీ శిశువునుగూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పిన సంగతులనుగూర్చి విన్నవారందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి.
చదువండి లూకా 2
వినండి లూకా 2
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: లూకా 2:1-18
5 రోజులు
దేవుని మహిమ అనేది మనం విన్న విషయం, అయితే దాని పరిచయం కారణంగా ఆ పదాన్ని మనం తేలికగా తీసుకుంటాము. ఈ క్రిస్టమస్ మీ దృక్కోణములో కొంత భాగాన్ని గానీ లేదా అంతటిని గానీ మార్చడానికి మీరు అనుమతిస్తూ ఉండగా, దేవుని గురించి బాగా తెలిసిన ఇంకా పదునైన సత్యాన్ని మీరు తిరిగి ఆలోచిస్తారని మేము ఆశిస్తున్నాము.
14 రోజులు
మా "క్రిస్మస్ ఈజ్ ఇన్ హార్ట్" డిజిటల్ ప్రచారంతో క్రిస్మస్ యొక్క నిజమైన స్ఫూర్తిని అనుభవించండి! ఈ ప్రత్యేక కార్యక్రమం లుమో క్రిస్మస్ ఫిల్మ్ నుండి స్పూర్తిదాయకమైన క్లిప్‌ల ద్వారా, వ్యక్తిగత ప్రతిబింబం, అర్థవంతమైన సంభాషణలు మరియు సమాజ నిశ్చితార్థాన్ని ప్రోత్సహించడం ద్వారా యేసు కథను కనుగొనడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అనేక భాషలలో అందించబడింది, ఇది అన్ని నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులను ఒకచోట చేర్చి సీజన్ అంతా ఈ ఆనందకరమైన అనుభవాన్ని పంచుకుంటుంది.
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు