యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచి–జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరు అది చూచి–ఈయన పాపియైన మనుష్యునియొద్ద బసచేయ వెళ్లెనని చాల సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి–ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు–ఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది. నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.
చదువండి లూకా 19
వినండి లూకా 19
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: లూకా 19:5-10
3 రోజులు
మనకు అవసరమైన దానిని తెలుసుకోవడం, మన లక్ష్యాలను అనుసరించడం చెడ్డవిషయం కాదు. అయితే మనం దేవుని వాక్య వెలుగులో నడవాలి. కొంతమంది సరైన దిశలో అడుగులు వేస్తారు, సాధకులుగా మారతారు. మరికొందరు ఒక ప్రకటన చేయడానికి ప్రయత్నించి, ముగింపులో నిలిచిపోతారు. మన శరీరానికి సంబంధించిన ప్రవృత్తిని సంతృప్తి పరచడం మన ఆత్మలతో విభేదాలకు గురిచేస్తుంది. మనం చేసే ఎంపికలు మరణానికీ లేదా జీవానికీ దారి తీస్తాయి.
9 రోజులు
ఈ గందరగోళ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు గురించి మరింత తెలుసుకోడానికి యెంచుకోండి, అనిశ్చిత సమయాల్లో భయం విషయంలో విశ్వాసం కలిగియుండడానికి యెంచుకోండి. మీరు ఈ ప్రణాళికను చదువుతున్నప్పుడు ప్రతీ దినం ఏమి జరుగుతున్నప్పటికీ భవిష్యత్తులోనికి ధైర్యంగా అడుగు పెడతారని మేము నిరీక్షిస్తున్నాము.
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు