లేవీయకాండము 25:1-7

లేవీయకాండము 25:1-7 TELUBSI

మరియు యెహోవా సీనాయికొండమీద మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–నేను మీకిచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడ యెహోవా పేరట విశ్రాంతి కాలమును, ఆచరింపవలెను. ఆరుసంవత్సరములు నీ చేను విత్తవలెను. ఆరుసంవత్సరములు నీ ఫలవృక్షములతోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొన వచ్చును. ఏడవ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు; నీ ఫలవృక్షములతోటను శుద్దిపరచకూడదు. నీ కారుచేల పంటను కోసికొనకూడదు, శుద్దిపరచని నీ వృక్షఫలములను ఏరుకొనకూడదు; అది భూమికి విశ్రాంతి సంవత్సరము. అప్పుడు భూమియొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికిని నీ దాసికిని నీ జీతగానికిని నీతో నివసించు పరదేశికిని ఆహారమగును. మరియు నీ పశువులకును నీ దేశజంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును.