యోబు 4:1-8

యోబు 4:1-8 TELUBSI

దానికి తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెను– ఎవడైన ఈ సంగతి యెత్తి నీతో మాటలాడినయెడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరకొనగలడు? అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడవు బలహీనమైన చేతులను బలపరచినవాడవు. నీ మాటలు తొట్రిల్లువానిని ఆదుకొని యుండెను. క్రుంగిపోయిన మోకాళ్లుగలవానిని నీవు బలపరచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసికొనుము, నిరపరాధియైన యొకడు ఎప్పుడైన నశించెనా? యథార్థవర్తనులు ఎక్కడనైన నిర్మూలమైరా? నేను చూచినంతవరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు.