యోబు 21:27-34

యోబు 21:27-34 TELUBSI

మీ తలంపులు నేనెరుగుదును మీరు నామీద అన్యాయముగా పన్నుచున్న పన్నా గములు నాకు తెలిసినవి. –అధిపతులమందిరము ఎక్కడ నున్నది? భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరడుగుచున్నారే. దేశమున సంచరించువారిని మీరడుగలేదా?వారు తెలియజేసిన సంగతులు మీరు గురుతు పట్ట లేదా? అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాలమందు కాపాడ బడుదురు ఉగ్రతదినమందువారు తోడుకొని పోబడుదురు. వారి ప్రవర్తననుబట్టి వారితో ముఖాముఖిగా మాట లనగలవాడెవడు?వారు చేసినదానినిబట్టి వారికి ప్రతికారముచేయు వాడెవడు? వారు సమాధికి తేబడుదురు సమాధి శ్రద్ధగా కావలికాయబడును పల్లములోని మంటి పెల్లలు వారికి ఇంపుగా నున్నవి మనుష్యులందరు వారివెంబడి పోవుదురు ఆలాగుననే లెక్క లేనంతమంది వారికి ముందుగా పోయిరి. మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు ఇట్టి నిరర్థకమైన మాటలతో మీరేలాగునన్ను ఓదార్చ జూచెదరు?