యోబు 14:7-12

యోబు 14:7-12 TELUBSI

వృక్షము నరకబడినయెడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేతకొమ్మలు వేయుననియు నమ్మకముకలదు. దాని వేరు భూమిలో పాతదై పోయినను దాని అడుగుమొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసనమాత్రముచేత అది చిగుర్చును లేత మొక్కవలె అది కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచినతరువాత వారేమై పోవుదురు? తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో ఆలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశము గతించిపోవువరకు వారు మేలుకొనరు. ఎవరును వారిని నిద్ర లేపజాలరు.