మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి–ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల. నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు; ఆయన నాకంటె ప్రముఖుడు గనుక నాకంటె ముందటి వాడాయెనని నేనెవరినిగూర్చి చెప్పితినో ఆయనే యీయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మ మిచ్చుచు వచ్చితినని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు– ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు–నీవెవనిమీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మ మిచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చితిననెను. మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసువైపు చూచి–ఇదిగో దేవుని గొఱ్ఱెపిల్ల అని చెప్పెను.
చదువండి యోహాను 1
వినండి యోహాను 1
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యోహాను 1:29-36
7 రోజులు
నీ పేరు ఏమిటి? మీ పేరు మీ గురించి ఏమైనా చెబుతుందా? బైబిల్ కాలంలో, పేర్లు వారికి ఇవ్వబడిన వ్యక్తి గురించి మాట్లాడాయి. ఈ పఠన ప్రణాళికలో, యేసుకు ఇవ్వబడిన ఏడు వేర్వేరు పేర్లను చూడటం ద్వారా మనం ఆయన గురించిన సత్యాలను కనుగొంటాము.
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు