యోహాను 1:1-28

యోహాను 1:1-28 TELUBSI

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయనలేకుండ కలుగలేదు. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను. అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగునుగూర్చి సాక్ష్య మిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగైయుండ లేదు గాని ఆ వెలుగునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతిమనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు. ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారేగాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి యోహాను ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు–నా వెనుక వచ్చువాడు నాకంటె ప్రముఖుడు గనుక ఆయన నాకంటె ముందటివాడాయెననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానునొద్దకు పంపి నప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను; క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు–మరి నీవెవరవు, నీవు ఏలీయావా అని అడుగగా అతడు–కాననెను. –నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా– కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు–నీవెవరవు? మమ్ము పంపినవారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్నుగూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతని నడిగిరి. అందు కతడు–ప్రవక్తయైన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాళముచేయుడి అని అరణ్య ములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను. పంపబడినవారు పరిసయ్యులకు చెందినవారు. వారు–నీవు క్రీస్తువైనను ఏలీయావైనను ఆ ప్రవక్త వైనను కానియెడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతనిని అడుగగా యోహాను– నేను నీళ్లలో బాప్తిస్మ మిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు; మీరాయన నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యొర్దానునదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను.

ఉచిత పఠన ప్రణాళికలు మరియు యోహాను 1:1-28 కు సంబంధించిన వాక్య ధ్యానములు

ఈస్టర్ అనేది క్రాస్ - 4 రోజుల వీడియో ప్రణాళిక యోహాను 1:1-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

ఈస్టర్ అనేది క్రాస్ - 4 రోజుల వీడియో ప్రణాళిక

4 రోజులు

మా "ఈస్టర్ ఈజ్ క్రాస్" డిజిటల్ ప్రచారంతో ఈస్టర్ యొక్క నిజమైన స్ఫూర్తిని అనుభవించండి! ఈ ప్రత్యేక కార్యక్రమం లూమో ఈస్టర్ చిత్రాల నుండి ఉత్తేజకరమైన క్లిప్‌ల ద్వారా యేసు కథను అన్వేషించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది, వ్యక్తిగత ప్రతిబింబం, అర్ధవంతమైన సంభాషణలు మరియు సమాజ నిశ్చితార్థాన్ని ప్రోత్సహిస్తుంది. యేసు జీవితం, పరిచర్య మరియు అభిరుచిని హైలైట్ చేసే కంటెంట్‌ను కలిగి ఉన్న ఈ కార్యక్రమం బహుళ భాషలలో అందించబడుతుంది, ఈస్టర్ సీజన్ అంతా ఆశ మరియు విముక్తి సందేశంలో పంచుకునేందుకు అన్ని నేపథ్యాల ప్రజలను కలిసి తీసుకువస్తుంది.