యెషయా 58:1-4

యెషయా 58:1-4 TELUBSI

తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలువేయుమువారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయుము యాకోబు ఇంటివారికి వారి పాపములను తెలియజేయుము తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నాయొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలిసికొన నిచ్ఛ కనుపరచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని వారడు గుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావలెనని యిచ్ఛ యింతురు. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు? అని అందురు మీ ఉపవాసదినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారిచేత కఠినమైనపని చేయించుదురు మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయ ముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు.

యెషయా 58:1-4 కోసం వీడియో