–ఎత్తుచేయుడి ఎత్తుచేయుడి త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయుదానిని నా జనుల మార్గములోనుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు –నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడును కోపించువాడను కాను ఆలాగుండినయెడల నా మూలముగా జీవాత్మ క్షీణిం చును నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. వారి లోభమువలన కలిగిన దోషమునుబట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగుచేసికొని కోపించితినివారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడచుచు వచ్చిరి. నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతునువారిలో దుఃఖించువారిని ఓదార్చుదును. వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమా ధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చు చున్నాడు. భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకివేయును. దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చు చున్నాడు.
చదువండి యెషయా 57
వినండి యెషయా 57
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యెషయా 57:14-21
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు