ఆదికాండము 49:13-21

ఆదికాండము 49:13-21 TELUBSI

జెబూలూను సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోనువరకు నుండును. ఇశ్శాఖారు రెండు దొడ్లమధ్యను పండుకొనియున్న బలమైన గార్దభము. అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టిచేయు దాసుడగును. దాను ఇశ్రాయేలు గోత్రికులవలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుఱ్ఱపు మడిమెలు కరచును అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. యెహోవా, నీ రక్షణకొరకు కనిపెట్టి యున్నాను. బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును. ఆషేరునొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైనమాటలు పలుకును.

ఆదికాండము 49:13-21 కోసం వీడియో