ఆదికాండము 11:10-26

ఆదికాండము 11:10-26 TELUBSI

షేము వంశావళి ఇది. షేము నూరేండ్లుగలవాడై జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనినతరువాత ఐదువందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను. అర్పక్షదు షేలహును కనినతరువాత నాలుగు వందలమూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను. షేలహు ఏబెరును కనినతరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను. ఏబెరు పెలెగును కనినతరువాత నాలుగువందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. పెలెగు ముప్పది యేండ్లు బ్రదికి రయూను కనెను. పెలెగు రయూను కనినతరువాత రెండువందల తొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. రయూ ముప్పది రెండేండ్లు బ్రదికి సెరూగును కనెను. రయూ సెరూగును కనినతరువాత రెండు వందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. సెరూగు ముప్పది యేండ్లు బ్రదికి నాహోరును కనెను. సెరూగు నాహోరును కనినతరువాత రెండువందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు ఇరువది తొమ్మిది యేండ్లు బ్రదికి తెరహును కనెను. నాహోరు తెరహును కనినతరువాత నూటపం దొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను. తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను.

ఆదికాండము 11:10-26 కోసం వీడియో