ఇది మాత్రమే మీవలన తెలిసికొనగోరుచున్నాను; ధర్మశాస్త్రసంబంధ క్రియలవలన ఆత్మ ను పొందితిరా లేక విశ్వాస ముతో వినుటవలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మా నుసారముగా ఆరంభించి, యిప్పుడు శరీ రానుసారముగా పరిపూర్ణులగుదురా? వ్యర్థముగానే యిన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థ మగునా? ఆత్మ ను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్రసంబంధ క్రియలవలననా లేక విశ్వాసముతో వినుటవలననా చేయించుచున్నాడు? అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా యెంచ బడెను. కాబట్టి విశ్వాససంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి– నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను.
చదువండి గలతీయులకు 3
వినండి గలతీయులకు 3
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: గలతీయులకు 3:2-8
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు