గలతీయులకు 3:1-6

గలతీయులకు 3:1-6 TELUBSI

ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువవేయబడినవాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కన్నులయెదుట ప్రదర్శింపబడెనుగదా! ఇది మాత్రమే మీవలన తెలిసికొనగోరుచున్నాను; ధర్మశాస్త్రసంబంధ క్రియలవలన ఆత్మ ను పొందితిరా లేక విశ్వాస ముతో వినుటవలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మా నుసారముగా ఆరంభించి, యిప్పుడు శరీ రానుసారముగా పరిపూర్ణులగుదురా? వ్యర్థముగానే యిన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థ మగునా? ఆత్మ ను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్రసంబంధ క్రియలవలననా లేక విశ్వాసముతో వినుటవలననా చేయించుచున్నాడు? అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా యెంచ బడెను.