యెహెజ్కేలు 23:18-21

యెహెజ్కేలు 23:18-21 TELUBSI

ఇట్లు అది జారత్వము అధికముగాచేసి తన మానాచ్ఛాదనము తీసి వేసికొనెను గనుక దాని అక్క విషయములో నేను ఆశాభగ్నుడనైనట్టు దాని విషయములోను ఆశాభగ్నుడ నైతిని. మరియు యౌవనదినములందు ఐగుప్తు దేశములో తాను జరిగించిన వ్యభిచారము మనస్సునకు తెచ్చుకొని అది మరి ఎక్కువగా వ్యభిచారము చేయుచు వచ్చెను. గాడిద గుఱ్ఱములవంటి సిగ్గుమాలిన మోహముగల తన విటకాండ్రయందు అది మోహము నిలుపుచుండెను. యౌవనకాలమందు నీవు ఐగుప్తీయులచేత నీ చనులను నలిపించుకొనిన సంగతి జ్ఞాపకము చేసికొని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలెనని నీవు చూచుచుంటివి.

యెహెజ్కేలు 23:18-21 కోసం వీడియో