ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచెనుగాని, మోషే ఫరో యెదుటనుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచి పోయి యొక బావియొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మందకాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రియైన రగూయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు–నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరనెను. అందుకు వారు–ఐగుప్తీయుడొకడు మందకాపరుల చేతిలోనుండి మమ్మును తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా అతడు తన కుమార్తెలతో–అతడెక్కడ? ఆ మనుష్యుని ఏల విడిచి వచ్చితిరి? భోజనమునకు అతని పిలుచుకొని రండనెను. మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తెయైన సిప్పోరాను మోషే కిచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే–నేను అన్య దేశములో పర దేశినై యుంటిననుకొని వానికి గెర్షోము అనుపేరు పెట్టెను. ఆలాగున అనేక దినములు జరిగినమీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు చుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారు పెట్టిన మొర దేవునియొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను; దేవుడు వారియందు లక్ష్యముంచెను.
చదువండి నిర్గమకాండము 2
వినండి నిర్గమకాండము 2
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: నిర్గమకాండము 2:15-25
7 రోజులు
ఎవరైనా హింసించబడుతున్నప్పుడు, ఆ సందర్భంలో భయపడడమనేది వారి అత్యంత శక్తివంతమైన భావోద్వేగాలలో ఒకటి. దాడులు, జైలుకు తీసుకువెళ్ళడం, సంఘ భవనాలను మూసివేయడం, విశ్వాస౦వల్ల ప్రియమైనవారు, తోటి విశ్వాసులు మరణి౦చడ౦ ఇవన్నీ మన క్రైస్తవ ప్రయాణ౦లో ముందుకు సాగడానికి భయాన్ని, నిస్సహాయతను కలిగిస్తాయి. మీరు ఇప్పుడు భయపడుతున్నట్లయితే, హింసను ఎదుర్కొంటున్నప్పుడు భయాన్ని ఎదుర్కోవటానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి ఈ పఠన ప్రణాళిక చాలా గొప్పగా సహాయపడుతుంది.
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు