ద్వితీయోపదేశకాండము 1:19-35

ద్వితీయోపదేశకాండము 1:19-35 TELUBSI

మనము హోరేబునుండి సాగి మన దేవుడైన యెహోవా మనకాజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములోనుండి వచ్చి, అమోరీయుల మన్నెపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితిమి. అప్పుడు నేను–మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్నెమునకు వచ్చియున్నాము. ఇదిగో నీ దేవుడైన యెహోవా యీ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాని స్వాధీనపరచుకొనుము, భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పి తిని. అప్పుడు మీరందరు నాయొద్దకు వచ్చి–మనకంటె ముందుగా మనుష్యులను పంపుదము; వారు మనకొరకు ఈ దేశమును వేగు జూచి, తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్లవలసిన త్రోవనుగూర్చియు, మనము చేర వలసిన పురములనుగూర్చియు మనకు వర్తమానము చెప్పుదు రంటిరి. ఆ మాట మంచిదనుకొని నేను గోత్రమొక్కంటికి ఒక మనుష్యుని చొప్పున పన్నిద్దరు మనుష్యులను పిలిపించితిని. వారు తిరిగి ఆ మన్నెమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగుజూచి ఆ దేశఫలములను చేతపట్టుకొని మనయొద్దకు తీసికొని వచ్చి–మన దేవుడైన యెహోవా మన కిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియజెప్పిరి. అయితే మీరు వెళ్లనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగబడి మీ గుడారములలో సణుగుచు–యెహోవా మనయందు పగపెట్టినందున మనలను సంహరించునట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తుదేశములోనుండి మనలను రప్పించియున్నాడు. మనమెక్కడికి వెళ్లగలము? మన సహోదరులు–అక్కడి జనులు మనకంటె బలిష్ఠులును ఎత్త రులునై యున్నారు; ఆ పట్టణములు గొప్పవై ఆకాశము నంటు ప్రాకారములతో నున్నవి; అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి. అప్పుడు నేను మిమ్మును చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి, మీకు ముందర నడుచు చున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నులయెదుట ఐగుప్తులోను అరణ్యములోను మీకొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఈ చోటికి చేరువరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనునట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తికొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవాయందు మీరు విశ్వాసముంచలేదు. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి–నేను మీపితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన యీ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో