అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును; అతనికి రాజ్యఘనత నియ్యరుగాని నెమ్మది కాలమందు అతడువచ్చి యిచ్చకపు మాటలచేత రాజ్యమును అపహరించును. ప్రవాహమువంటి బలము అతని యెదుటనుండి వారిని కొట్టుకొని పోవుటవలనవారు నాశనమగుదురు; సంధి చేసిన అధిపతి సహా నాశనమగును. అతడు సంధిచేసినను మోసపుచ్చును. అతడు స్వల్పజనముగలవాడైనను ఎదు రాడి బలము పొందును. అతడు సమాధాన క్షేమముగల దేశమునకు వచ్చి, తన పితరులు కాని తన పితరుల పితరులుగాని చేయనిదానిని చేయును; ఏదనగా అచ్చట ఆస్తిని, దోపుడుసొమ్మును, ధనమును విభజించి తనవారికి పంచి పెట్టును. అంతట కొంతకాలము ప్రాకారములను పట్టుకొనుటకు కుట్రచేయును అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని, దక్షిణదేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరచి, తన మనస్సును రేపుకొనును గనుక దక్షిణదేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహా బలముగలవాడై యుద్ధమునకు సిద్ధపడును. అతడు దక్షిణ దేశపురాజునకు విరోధమైన ఉపాయములు చేయనుద్దేశించినందున ఆ రాజు నిలువలేకపోవును. ఏమనగా, అతని భోజనమును భుజించువారు అతని పాడు చేసెదరు; మరియు అతని సైన్యము ఓడిపోవును గనుక అనేకులు హతులవుదురు. కీడుచేయుటకై ఆ యిద్దరు రాజులు తమ మనస్సులు స్థిరపరచుకొని, యేకభోజన పంక్తిలో కూర్చుండినను కపటవాక్యములాడెదరు; నిర్ణయ కాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు. అతడు మిగుల ద్రవ్యముగలవాడై తన దేశమునకు మరలును. మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధియై యిష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును. నిర్ణయకాలమందు మరలి దక్షిణదిక్కునకు వచ్చునుగాని మొదట నున్నట్టుగా కడపటనుండదు. అంతట కిత్తీయుల ఓడలు అతనిమీదికి వచ్చుటవలన అతడు వ్యాకులపడి మరలి, పరిశుద్ధ నిబంధన విషయములో అత్యాగ్రహముగలవాడై, తన యిష్టానుసారముగా జరిగించును. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును. అతని పక్షమున శూరులు లేచి, పరిశుద్ధస్థలపు కోటను అపవిత్రపరచి, అనుదిన బలి నిలిపివేసి, నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురు. అందుకతడు ఇచ్చకపుమాటలు చెప్పి నిబంధన నతిక్రమించువారిని వశపరచుకొనును; అయితే తమ దేవుని నెరుగువారు బలముకలిగి గొప్ప కార్యములు చేసెదరు. జనములో బుద్ధిమంతులు ఆనేకులకు బోధించుదురు గాని వారు బహు దినములు ఖడ్గమువలనను అగ్ని వలనను క్రుంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు. వారు క్రుంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును, అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు గాని నిర్ణయకాలము ఇంక రాలేదు గనుక అంత్యకాలమువరకు జనులను పరిశీ లించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు.
చదువండి దానియేలు 11
వినండి దానియేలు 11
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: దానియేలు 11:21-35
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు