ఆ రాత్రి ప్రభువు అతనియొద్ద నిలుచుండి–ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్నుగూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగున రోమాలో కూడ సాక్ష్య మియ్యవలసియున్నదని చెప్పెను. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి, తాము పౌలును చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. ఈ కుట్రలో చేరినవారు నలుబదిమంది కంటె ఎక్కువ. వారు ప్రధానయాజకుల యొద్దకును పెద్దలయొద్దకును వచ్చి–మేము పౌలును చంపువరకు ఏమియు రుచి చూడమని గట్టిగ ఒట్టుపెట్టుకొని యున్నాము. కాబట్టి మీరు మహా సభతో కలిసి, అతనినిగూర్చి మరి పూర్తిగా విచారించి తెలిసికొనబోవునట్టు అతనిని మీ యొద్దకు తీసికొని రమ్మని సహస్రాధిపతితో మనవిచేయుడి; అతడు దగ్గరకు రాకమునుపే మేమతని చంపుటకు సిద్ధపడియున్నామని చెప్పిరి. అయితే పౌలు మేనల్లుడు వారు పొంచియున్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు పౌలు శతాధిపతులలో నొకనిని తనయొద్దకు పిలిచి–ఈ చిన్నవానిని సహస్రాధిపతియొద్దకు తోడుకొనిపొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలెనని యున్నాడనెను. శతాధిపతి సహస్రాధిపతియొద్ద కతని తోడుకొనిపోయి–ఖైదీయైన పౌలు నన్ను పిలిచి–నీతో ఒక మాట చెప్పుకొనవలెననియున్న యీ పడుచువానిని నీయొద్దకు తీసికొనిపొమ్మని నన్ను అడిగెనని చెప్పెను. సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకొని అవతలకు తీసి కొనిపోయి–నీవు నాతో చెప్పుకొనవలెనని యున్నదేమని యొంటరిగా అడిగెను. అందుకతడు–నీవు పౌలునుగూర్చి సంపూర్తిగా విచారింపబోవునట్టు అతనిని రేపు మహాసభ యొద్దకు తీసికొని రావలెనని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టి యున్నారు. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు; వారిలో నలువదిమందికంటె ఎక్కువ మనుష్యులు అతనికొరకు పొంచియున్నారు. వారు అతని చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనియున్నారు; ఇప్పుడు నీయొద్ద మాట తీసికొనవలెనని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పెను. అందుకు సహస్రాధిపతి–నీవు ఈ సంగతి నాకు తెలిపితివని యెవనితోను చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువానిని పంపివేసెను. తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తనయొద్దకు పిలిచి–కైసరయవరకు వెళ్లుటకు ఇన్నూరు మంది సైనికులను డెబ్బదిమంది గుఱ్ఱపురౌతులను ఇన్నూరు మంది యీటెలవారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధపరచి పౌలును ఎక్కించి–అధిపతియైన ఫేలిక్సునొద్దకు భద్రముగా తీసికొనిపోవుటకు గుఱ్ఱములను సిద్ధపరచుడని చెప్పెను. మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసెను– మహాఘనతవహించిన అధిపతియైన ఫేలిక్సుకు క్లౌదియ లూసియ వందనములు. యూదులు ఈ మనుష్యుని పట్టుకొని చంపబోయినప్పుడు, అతడు రోమీయుడని నేను విని, సైనికులతో వచ్చి అతనిని తప్పించితిని. వారు అతనిమీద మోపిన నేరమేమో తెలిసికొనగోరి నేను వారి మహాసభయొద్దకు అతనిని తీసికొనివచ్చితిని. వారు తమ ధర్మశాస్త్రవాదములనుగూర్చి అతనిమీద నేరము మోపిరే గాని మరణమునకైనను, బంధకములకైనను తగిన నేరము అతనియందేమియు కనుపరచలేదు. అయితే వారు ఈ మనుష్యునిమీద కుట్రచేయనై యున్నారని నాకు తెలియవచ్చినందున, వెంటనే అతని నీయొద్దకు పంపించితిని. నేరము మోపినవారు కూడ అతనిమీద చెప్పవలెనని యున్న సంగతి నీయెదుట చెప్పుకొన నాజ్ఞాపించితిని. కాబట్టి అతడు వారికాజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రికి తీసికొనిపోయిరి. మరునాడు వారతనితోకూడ రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి. వారు కైసరయకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడ అతనియెదుట నిలువ బెట్టిరి. అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు–ఇతడు ఏ ప్రదేశపువాడని అడిగి, అతడు కిలికియవాడని తెలిసికొని –నీమీద నేరము మోపువారు కూడ వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారింతునని చెప్పి, హేరోదు అధికారమందిరములో అతనిని కావలియందుంచవలెనని ఆజ్ఞాపించెను.
చదువండి అపొస్తలుల కార్యములు 23
వినండి అపొస్తలుల కార్యములు 23
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: అపొస్తలుల కార్యములు 23:11-35
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు