ఇశ్రాయేలువారి సకల గోత్రములవారు హెబ్రో నులో దావీదునొద్దకు వచ్చి–చిత్తగించుము; మేము నీ ఎముకనంటినవారము రక్తసంబంధులము; పూర్వకాలమున సౌలు మామీద రాజై యుండగా నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు–నీవు ఇశ్రాయేలీయులనుబట్టి నా జనులను పాలించి వారిమీద అధిపతివై యుందువని యెహోవా నిన్నుగురించి సెలవిచ్చియున్నాడని చెప్పిరి. మరియు ఇశ్రాయేలువారి పెద్దలందరు హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను గనుక ఇశ్రాయేలువారిమీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. దావీదు ముప్పది యేండ్లవాడై యేలనారంభించి నలువది సంవత్సరములు పరిపాలనచేసెను. హెబ్రోనులో అతడు యూదా వారందరిమీద ఏడు సంవత్సరముల ఆరు మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరిమీద ముప్పదిమూడు సంవత్సరములు పరిపాలన చేసెను.
చదువండి 2 సమూయేలు 5
వినండి 2 సమూయేలు 5
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 2 సమూయేలు 5:1-5
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు