2 సమూయేలు 19:40-43

2 సమూయేలు 19:40-43 TELUBSI

యూదా వారందరును ఇశ్రాయేలువారిలో సగము మందియు రాజును తోడుకొని రాగా రాజు కింహామును వెంటబెట్టుకొని గిల్గాలునకు వచ్చెను. ఇట్లుండగా ఇశ్రాయేలు వారందరును రాజునొద్దకు వచ్చి–మా సహోదరులగు యూదావారు ఎందుకు నిన్ను దొంగిలించుకొని, నీ యింటివారిని నీవారిని యొర్దాను ఇవతలకు తోడుకొని వచ్చిరని యడుగగా యూదా వారందరు–రాజు మీకు సమీపబంధువుడై యున్నాడు గదా, మీకు కోప మెందుకు? ఆలాగుండినను మాలో ఎవరమైనను రాజు సొమ్ము ఏమైనను తింటిమా? మాకు యినాము ఏమైన ఇచ్చెనా? అని ఇశ్రాయేలువారితో అనిరి. అందుకు ఇశ్రాయేలు వారు–రాజులో మాకు పది భాగములున్నవి; మీకంటె మేము దావీదునందు అధిక స్వాతంత్యము గలవారము; రాజును తోడుకొని వచ్చుటనుగురించి మీతో ముందుగా మాటలాడినవారము మేమే గదా మీరు మమ్మును నిర్లక్ష్యము చేసితిరేమి? అని యూదా వారితో పలికిరి. యూదావారి మాటలు ఇశ్రాయేలు వారి మాటలకంటె కఠినముగా ఉండెను.