1 సమూయేలు 18:1-4

1 సమూయేలు 18:1-4 TELUBSI

దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను; యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్లనియ్యక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధనచేసికొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడి కట్టును తీసి దావీదున కిచ్చెను.