అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశ లను విసర్జించి, అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారిమధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
చదువండి 1 పేతురు 2
వినండి 1 పేతురు 2
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 పేతురు 2:9-12
5 రోజులు
మన జీవితాల్లో దేవునికి మొదటి స్థానం ఇవ్వటం అనేది ఏదో ఒక్కసారి జరిగే కార్యక్రమం కాదు... ఇది ప్రతి క్రైస్తవునికి జీవిత కాలపు ప్రక్రియ. మీరు విశ్వాసములో క్రొత్తవారైనా, లేదా క్రీస్తును అనేక సంవత్సరాలుగా వెంబడిస్తున్నవారైనా, అర్థం చేసుకొని అవలంబించటానికి ఈ ప్రణాళిక మీకు సులభంగా ఉంటుంది. మరియు ఇది విజయవంతమైన క్రైస్తవ జీవితాలు జీవించటానికి అత్యంత ప్రభావవంతమైన ప్రణాళికగా ఉంటుంది. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సేకరించబడింది.
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు